Telugu Global
Telangana

ఫైనల్ లిస్ట్ రెడీ.. కేసీఆర్ ప్రత్యర్థులు 81 మంది

సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తుండటంతో ఆ రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలోనే స్పెషల్ గా మారాయి.

ఫైనల్ లిస్ట్ రెడీ.. కేసీఆర్ ప్రత్యర్థులు 81 మంది
X

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. 119 నియోజకవర్గాల్లో అందరి దృష్టి గజ్వేల్, కామారెడ్డిపైనే ఉంది. ఆ రెండు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు పడ్డాయి. అక్కడే ఉపసంహరణలు కూడా అధికం. ఫైనల్ గా పోటీపడే ప్రత్యర్థులు కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటం విశేషం.

గజ్వేల్ స్కోర్ 44, కామారెడ్డి 39

సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తుండటంతో ఆ రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలోనే స్పెషల్ గా మారాయి. గజ్వేల్ లో స్క్రూటినీ తర్వాత 114మంది బరిలో నిలిచారు. వారిలో 70మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో చివరికి అక్కడ బరిలో నిలిచిన వారి సంఖ్య 44 దగ్గర ఆగిపోయింది. అందులో కేసీఆర్ ఒకరు కాగా, ఈటల రాజేందర్ తో కలిపి ఆయన ప్రత్యర్థులు 43మంది.

కామారెడ్డిలో స్క్రూటినీ తర్వాత 58మంది బరిలో నిలిచారు. వారిలో 19మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా.. చివరికి 39మంది బరిలో నిలిచారు. అంటే కేసీఆర్ మినహా మిగతావారి సంఖ్య 38. వారిలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తమ్మీద గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ సహా మొత్తం 83మంది బరిలో ఉన్నట్టు లెక్క. అంటే ఆ రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రత్యర్థులు 81మంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 స్థానాలకు 312 మంది అభ్యర్థులు బరిలో ఉండటం విశేషం. ఈ 15 స్థానాల పరిధిలో కేవలం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

First Published:  15 Nov 2023 4:05 PM GMT
Next Story