Telugu Global
Telangana

భారీగా పెరిగిన తెలంగాణ ఎన్నికల బందోబస్తు ఖర్చు.. ఈసారి ఎంతంటే..?

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నాయకులకు కూడా భద్రత పెంచారు. బహిరంగ సభల వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

భారీగా పెరిగిన తెలంగాణ ఎన్నికల బందోబస్తు ఖర్చు.. ఈసారి ఎంతంటే..?
X

2018 తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకోసం అయిన బందుబస్తు ఖర్చు రూ.100కోట్లు

2023 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు అంచనా రూ.150 కోట్లు

50కోట్ల రూపాయల పెరుగదల అంటే మాటలు కాదు. ఐదేళ్లలో బందోబస్తు ఖర్చులు 50శాతం పెరిగాయి. పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకోసం ఈసారి తెలంగాణలో బందోబస్తు పెంచారు.

అడుగడుగునా చెక్ పోస్ట్ లు..

అక్టోబర్ 9నుంచే తెలంగాణలో తనిఖీలు ముమ్మరం అయ్యాయి. 373 ఫ్లయింగ్‌ స్క్వాడ్ లు, 374 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్ లు, 95 అంతర్ రాష్ట్ర చెక్‌ పోస్టులు ఏర్పాటుచేశారు. ఇప్పటికే కేంద్రం నుంచి 100 కంపెనీల పారామిలటరీ బలగాలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బలగాలతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే రాష్ట్ర పోలీసుల భత్యాలు, వాహనాలకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి. ఈ ఖర్చంతా 150 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. రాష్ట్ర పోలీసు సిబ్బంది 60 వేల మంది వరకు ఉండగా మరో 300 కంపెనీల పారా మిలటరీ బలగాలు కేంద్రంనుంచి రాబోతున్నాయి. ఇక చుట్టుపక్కల ఎన్నికలు లేని రాష్ట్రాలనుంచి మరో 10వేల మంది వరకు పోలీసులు తెలంగాణ ఎన్నికలకోసం వస్తున్నారు.

ఎంపీపై దాడి నేపథ్యంలో..

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నాయకులకు కూడా భద్రత పెంచారు. బహిరంగ సభల వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ను గంట ముందుగానే ముగించాలనే నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. ఆయా ప్రాంతాల్లో ప్రచారం విషయంలో కూడా అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. చత్తీస్‌ ఘఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తై... ఫలితాలు వెలువడే వరకూ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందేనంటున్నారు అధికారులు.

First Published:  1 Nov 2023 7:14 AM IST
Next Story