నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు..
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్. తెలంగాణకు నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్. తెలంగాణకు నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తారు.
తెలంగాణ ఎన్నికలు ఇలా..
నవంబర్ 3న నోటిఫికేషన్
నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10
నామినేషన్ల స్క్రూటినీ నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15
పోలింగ్ తేదీ -నవంబర్ 30
ఫలితాల ప్రకటన డిసెంబర్ 3
మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,356
27,798 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
ఎన్నికల కోసం 72 వేల బ్యాలెట్ యూనిట్లు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు
తెలంగాణతోపాటు మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
మిజోరం
నవంబర్ 7న పోలింగ్
డిసెంబర్ 3న కౌంటింగ్
మధ్యప్రదేశ్
నవంబర్ 17న పోలింగ్
డిసెంబర్ 3న కౌంటింగ్
రాజస్థాన్
నవంబర్ 23న పోలింగ్
డిసెంబర్ 3న కౌంటింగ్
చత్తీస్ ఘడ్
రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. తొలి విడత నవంబర్ 7న, రెండో విడత నవంబర్ 17న జరుగుతుంది.
డిసెంబర్ 3న కౌంటింగ్