Telugu Global
Telangana

రేవంత్‌ షాకింగ్ డెసిషన్‌.. 18 జిల్లాలు రద్దు.?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 10 జిల్లాలు ఉండగా.. పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సంఖ్యను 33కు పెంచింది. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించింది.

రేవంత్‌ షాకింగ్ డెసిషన్‌.. 18 జిల్లాలు రద్దు.?
X

తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 33గా ఉన్న జిల్లాల సంఖ్య.. దాదాపు సగానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

పార్లమెంట్ స్థానాలను జిల్లాలుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీంతో జిల్లాల సంఖ్య 17కు కుదించే అవకాశాలున్నాయి. ఇందుకోసం త్వరలోనే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించింది జగన్‌ సర్కార్. ఏపీలో విభజన నాటికి 13 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 26 జిల్లాలుగా విభజించారు.

పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటిస్తే.. ప్రస్తుతమున్న జిల్లాల్లో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దవుతాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 10 జిల్లాలు ఉండగా.. పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సంఖ్యను 33కు పెంచింది. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో జిల్లాల సంఖ్య విషయంలో పునరాలోచన చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం 33 జిల్లాలు అవసరం లేదని, జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందని కామెంట్స్ చేశారు. మరోవైపు జిల్లాలను ముట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

First Published:  27 March 2024 11:34 AM IST
Next Story