Telugu Global
Telangana

రెండు వేల మందితో తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌

విపత్తుల వేళ సాయమందించేలా వారికి శిక్షణ : సీఎస్‌ శాంతికుమారి

రెండు వేల మందితో తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌
X

తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల మందితో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నామని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటుపై మంగళవారం సెక్రటేరియట్‌ లో డీజీపీ జితేందర్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌, ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎస్‌ గుర్తు చేశారు. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ కు చెందిన పది కంపెనీల సిబ్బందిని ఉపయోగించి 2 వేల మంది తెలంగాణ డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు చేయాలని అదే సమయంలో సీఎం రేంవత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉంటూ, సహాయక చర్యలు చేపట్టడంపై డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ట్రైనింగ్‌ ఇస్తామన్నారు. నవంబర్‌ మొదటి వారంలోనే ఫస్ట్‌ బ్యాచ్ సిబ్బందికి ట్రైనింగ్‌ ప్రారంభించాలన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లకు అవసరమైన వాహనాలు, పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు సేకరించాల్నారు. సమావేశంలో ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ నాగిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

First Published:  15 Oct 2024 11:20 AM GMT
Next Story