Home > NEWS > Telangana > తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలంగాణలో ఉంటారా ? ఏపీకెళ్తారా ? ఈ రోజే తేలిపోతుంది
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలంగాణలో ఉంటారా ? ఏపీకెళ్తారా ? ఈ రోజే తేలిపోతుంది
డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఆయన ఏపీకివెళ్ళాలా తెలంగాణలోనే ఉండాలా అనేది ఈ రోజు హైకోర్టు తేల్చనుంది.
BY Telugu Global20 Jan 2023 7:28 AM IST
X
Telugu Global Updated On: 20 Jan 2023 6:32 PM IST
ఈ మధ్యే తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించిన హైకోర్టు మరి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అదికారుల భవిష్యత్తును ఈ రోజు తేల్చనుంది. డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్‌ను సీఎం కేసీఆర్ నియమించారు.
ఈ రోజు ఆయన కూడా ఏపీకి వెళ్ళాలా తెలంగాణలోనే ఉండాలా అనేది హైకోర్టు తేల్చనుంది. ఆయనతోపాటు 9 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల క్యాడర్ అలాట్ మెంట్‌పై కూడా తెలంగాణ హైకోర్ట్ ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.
ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి తదితరులున్నారు.
వారం కిందట సోమేష్ కుమార్‌ను హైకోర్ట్ ఏపీకి పంపింది. సోమేశ్ స్థానంలో శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.
Next Story