నాడు-నేడు.. తెలంగాణలో మార్పు స్పష్టం
మంచినీటి కుళాయిలు ఉన్న ఇళ్లు తెలంగాణలో 100 శాతం ఉన్నాయి. జాతీయ సగటు 70.76 శాతం దగ్గర ఆగిపోయింది. 2022లో జాతీయ జల్ జీవన్ అవార్డు కూడా తెలంగాణ అందుకుంది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లో దేశ సగటు(వెయ్యికి) 42 కాగా, తెలంగాణలో మరణాల సంఖ్య 29 మాత్రమే.
2019లో తెలంగాణలో మంచినీటి కుళాయిలు ఉన్న ఇళ్లు 29.05 శాతం
2023 నవంబర్ నాటికి మంచినీరు అందుతున్న ఇళ్లు 100 శాతం
2015-16లో పక్కా ఇళ్లలో నివశిస్తున్న జనాభా 75శాతం
2020-21 నాటికి తెలంగాణలో పక్కా ఇళ్లు ఉన్నవారు 79.2 శాతం
స్కూల్ పిల్లల డ్రాపవుట్లు 2019లో 1.92
డ్రాపవుట్ల శాతం 2022లో 1.45
2015-16 సర్వే ప్రకారం పసిపిల్లల మరణాలు వెయ్యికి 32. 2020-21 నాటికి ఆ సంఖ్య వెయ్యికి 29కి తగ్గింది.
ఈ గణాంకాలు చాలు తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ఏం సాధించిందో చెప్పడానికి. విభజన ముందు, విభజన తర్వాత తెలంగాణలో ఏం మార్పు వచ్చిందో చెప్పడానికి, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి వివరించడానికి. అవును గణాంకాలు స్పష్టంగా తెలంగాణ అభివృద్ధిని కళ్లకు కడుతున్నాయి. విద్య, వైద్యం, మౌలిక వసతులు.. అన్నిట్లోనూ తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది.
దేశ సగటుకంటే అధికం..
కేంద్రంలో ఉన్న బీజేపీ పాలన ఎలా ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది అని పోల్చి చూసినా కూడా గణాంకాలు రాష్ట్ర ప్రగతిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తెలంగాణలో ప్రతి ఇంటికీ మంచినీరు సరఫరా అవుతోంది. మంచినీటి కుళాయిలు ఉన్న ఇళ్లు తెలంగాణలో 100శాతం ఉన్నాయి. జాతీయ సగటు 70.76 శాతం దగ్గర ఆగిపోయింది. 2022లో జాతీయ జల్ జీవన్ అవార్డు కూడా తెలంగాణ అందుకుంది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లో దేశ సగటు(వెయ్యికి) 42 కాగా, తెలంగాణలో మరణాల సంఖ్య 29 మాత్రమే. మొత్తమ్మీద తెలంగాణలో మార్పు స్పష్టంగా కనపడుతోంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి గణాంకాలతో నిరూపితమైంది.
♦