Telugu Global
Telangana

ధూంధాం గా దశాబ్ది ఉత్సవాలు.. కలెక్టర్లకు రూ.105కోట్ల నిధులు

దశాబ్ది ఉత్సవాల నిర్వహణకోసం జిల్లా కలెక్టర్లకు రూ.105కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.

ధూంధాం గా దశాబ్ది ఉత్సవాలు.. కలెక్టర్లకు రూ.105కోట్ల నిధులు
X

తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు సీఎం కేసీఆర్. జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకోసం జిల్లా కలెక్టర్లకు రూ.105కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారైంది. 21రోజులపాటు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ షెడ్యూల్ పై జిల్లా కలెక్టర్లకు అవగాహన కల్పించారు సీఎం కేసీఆర్. సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారీ కార్యక్రమాల గురించి, ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివ‌రించారు. పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరగాలన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. షెడ్యూల్ లో పొందుపరిచినట్టుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయా కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు.

First Published:  25 May 2023 3:24 PM IST
Next Story