Telugu Global
Telangana

తెలంగాణ దశాబ్ది.. వైద్య రంగంపై కేటీఆర్ ట్వీట్

గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినపడుతున్నాయి. ఆస్పత్రుల్లో కరెంటు కోతలతో రోగులు అవస్థలు పడ్డారని తెలుస్తోంది.

తెలంగాణ దశాబ్ది.. వైద్య రంగంపై కేటీఆర్ ట్వీట్
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో వైద్య రంగం ఎలా ఉంది..? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగం ఎలా మారింది అనే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే అనే దుస్థితి ఉండేదని, ఇప్పుడు పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చామని వివరించారాయన.


"జననం నుండి మరణం దాకా,

ప్రతి దశలో మన సర్కారున్నది అనే

గొప్ప భరోసా తెచ్చినం.

కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు

డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు

బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులు

నగరం నలుమూలలా

నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

వరంగల్ నడిబొడ్డున

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా

జనాభా దామాషాలో

మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు!

ఒకటా? రెండా?

కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం

దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవం." అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..

గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినపడుతున్నాయి. ఆస్పత్రుల్లో కరెంటు కోతలతో రోగులు అవస్థలు పడ్డారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల సౌకర్యాల లేమితో ఉన్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తమ్మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఇప్పటి కాంగ్రెస్ సర్కారు.. ప్రభుత్వ ఆస్పత్రులపై శ్రద్ధ చూపించడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

First Published:  24 May 2024 2:47 PM IST
Next Story