తెలంగాణ:ఈ యాసంగి సీజన్‌లో రెట్టింపు కానున్న పంటల విస్తీర్ణం
సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 47.85 లక్షల ఎకరాలు కాగా బుధవారం నాటికే రాష్ట్రంలో మొత్తం 28.56 లక్షల ఎకరాల్లో సాగైంది. గత ఏడాది యాసంగి సీజన్‌లో జనవరి వరకు సాగైన 14.81 లక్షల ఎకరాల విస్తీర్ణంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
ఈ ఏడాది యాసంగి (రబీ) సీజన్‌లో రైతులుపెద్ద ఎత్తున నాట్లు వేయడంతో తెలంగాణ సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.
సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 47.85 లక్షల ఎకరాలు కాగా బుధవారం నాటికే రాష్ట్రంలో మొత్తం 28.56 లక్షల ఎకరాల్లో సాగైంది.
గత ఏడాది యాసంగి సీజన్‌లో జనవరి వరకు సాగైన 14.81 లక్షల ఎకరాల విస్తీర్ణంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
ప్రారంభంలో, అకాల వర్షాలు కురియడంతో యాసంగి సీజన్‌లో నాట్లు పనులు నెమ్మదిగా సాగాయి, పంట కోతలు ఆలస్యమయ్యాయి.
అయితే, గత రెండు వారాలుగా ఇది వేగం పుంజుకుంది. గత యాసంగి సీజన్‌లో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ 63.13 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది.
ఈ యాసంగి పంట సీజన్‌లో వరి జోరు కొనసాగుతోంది. వ్యవసాయ శాఖ తాజా నివేదికల ప్రకారం, సాగైన మొత్తం విస్తీర్ణంలో దాదాపు 60 శాతం వరి సాగు జరిగింది.
గత ఏడాది జనవరి 10 నాటికి ఇదే కాలంలో అకాల వర్షాలు, ఇతర సమస్యల కారణంగా కేవలం 3.85 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది.
తెలంగాణలో నీటి సరఫరా, విద్యుత్ తదితర సౌకర్యాలు పెరగడమే సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వరి సాగు నాట్ల నుండి మొలకెత్తే దశ వరకు వివిధ దశల్లో ఉంది.
తెలంగాణలో గత ఏడాది ఇదే కాలానికి 2.07 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా, ఈ సీజన్‌లో బుధవారం నాటికి 3.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది.
పప్పుధాన్యాలు సాగు చేస్తున్న మొత్తం భూమి 3.78 లక్షలఎకరాలు కాగా ఇది గత ఏడాది 4.09 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. నూనె గింజలు విత్తే కార్యకలాపాలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయని, అయితే మరో రెండు వారాల్లోనే అదివేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు.
గత యాసంగి సీజన్‌లో 3.53 లక్షల ఎకరాల్లో నూనె గింజల సాగుకాగా ఈ సారి గురువారం నాటికి 2.44 లక్షల ఎకరాల్లో ఆయిల్ విత్తనాలు వేశారు.
“చాలా చోట్ల, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, మెదక్‌లలో వరిసాగు మొలకెత్తే దశలో ఉంది. పప్పుధాన్యాలు పెరుగుతున్న దశ నుండి పుష్పించే దశ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. గత యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో 63.13 లక్షల ఎకరాల్లో సాగు కాగా , ప్రస్తుత సీజన్‌లో మొత్తం పంట ఆ సీజన్ ను అధిగమించగలదని మేము భావిస్తున్నాము, ”అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.