Telugu Global
Telangana

ఇవాళ కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి!

ఇవాళ రెండో జాబితా, నవంబర్‌ 2న మిగిలిన స్థానాలకు సంబంధించిన ఫైనల్ లిస్టు విడుదల చేస్తారని సమాచారం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇవాళ కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి!
X

ఇవాళ కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఇవాళ రెండో జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి. పార్టీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సెకండ్‌ లిస్ట్‌ ఫైనలైజ్ చేయనున్నారు. ఇక సెకండ్ లిస్ట్‌లో 35-45 మంది అభ్యర్థులుంటారని సమాచారం.

అక్టోబర్ 15న 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్‌. తర్వాత మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కె.మురళీధరన్ నేతృత్వంలో పలుమార్లు సమావేశమైంది. ఈ సమావేశాలకు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. గత బుధవారం నుంచి ప్రారంభమైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలకు సైతం ఈ ముగ్గురు నేతలు హాజరయ్యారు. అయితే స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాపై CEC సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ మళ్లీ సమీక్షించి గురువారం ఫైనల్ చేసింది. ఈ లిస్ట్‌ను ఇవాల్టి సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిటీ రివ్యూ చేయనుంది.

ఇవాళ రెండో జాబితా, నవంబర్‌ 2న మిగిలిన స్థానాలకు సంబంధించిన ఫైనల్ లిస్టు విడుదల చేస్తారని సమాచారం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. లెఫ్ట్ పార్టీలకు కేటాయించే రెండు స్థానాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ జరిగే సీఈసీ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. గురువారం రాత్రి ఢిల్లీలో మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మునుగోడు నుంచి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

First Published:  27 Oct 2023 8:44 AM IST
Next Story