బోసిపోయిన అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం.. కేసీఆర్ పై కాంగ్రెస్ కోపం
అంబేద్కర్ విగ్రహంతోపాటు.. నెక్లెస్ రోడ్ లోని అమరుల స్థూపాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని అంటున్నారు.
కేసీఆర్ పై కోపాన్ని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టిందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటయ్యాయనే కారణంగానే అంబేద్కర్ విగ్రహానికి, అమరుల స్థూపానికి లైటింగ్ పెట్టలేదని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో మిగతా అన్ని ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేసి.. కేసీఆర్ ని గుర్తు తెచ్చే వాటిపై మాత్రం వివక్ష చూపించారని అంటున్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని అందంగా అలంకరించారు. ప్రభుత్వ భవనాలకు లైటింగ్ ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ ని కూడా అందంగా ముస్తాబు చేశారు. అయితే ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారు. కనీసం అక్కడ లైటింగ్ కూడా పెట్టలేదని బీఆర్ఎస్ నేతలు వీడియోలు పోస్ట్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించారని అంటున్నారు.
The grudge against Babasaheb Ambedkar’s tallest statue continues as Congress Govt doesn’t even make arrangements of lights as we celebrate Independence Day…
— Krishank (@Krishank_BRS) August 14, 2024
Why ? Because it was erected by KCR Government pic.twitter.com/uTomULeWjw
అంబేద్కర్ విగ్రహంతోపాటు.. నెక్లెస్ రోడ్ లోని అమరుల స్థూపాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని అంటున్నారు.అమరుల త్యాగాలకు గుర్తుగా స్మృతి చిహ్నాన్ని బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీటిని చిన్నచూపు చూస్తోంది. కనీసం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా అలంకరించకపోవడం విశేషం.
మరోసారి అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2024
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ కట్టడాలకు అలంకరణ చేసి బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహనికి కనీసం లైట్లు వేయకపోవడం దారుణం.
అమరుల స్తూపం వద్ద కూడా ఇదే దుస్థితి కనిపించడం గమనార్హం. pic.twitter.com/bJad9rXZhF