అమ్మాయిలకు స్కూటీలు.. ఎప్పటినుంచో తెలుసా.!
18 ఏళ్లు పైబడిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
BY Telugu Global25 Dec 2023 10:18 PM IST
X
Telugu Global Updated On: 25 Dec 2023 11:02 PM IST
తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మరో స్కీమ్ అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత గ్యారంటీలో భాగంగా ఆరోగ్య శ్రీ బీమా రూ.10 లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించింది.
ఇక 18 ఏళ్లు పైబడిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రారంభించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇందుకోసం మొదటి విడతలో భాగంగా రూ. 300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లపై కేంద్రం సబ్సిడీ రూ.50 వేలు పోను మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
Next Story