Telugu Global
Telangana

ఆశావహులు ఎక్కువ, అవకాశాలు తక్కువ.. టీకాంగ్ లో బీసీ రాజకీయం

బీసీలకు టికెట్లు ఇచ్చారా లేదా అనేది తర్వాతి సంగతి, ముందు పార్టీ ఉనికి ముఖ్యం. అంటే గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలి. ముందు గెలిచే అభ్యర్థులను గుర్తించాలంటూ హైకమాండ్ ఆదేశించింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నారు.

ఆశావహులు ఎక్కువ, అవకాశాలు తక్కువ.. టీకాంగ్ లో బీసీ రాజకీయం
X

బీఆర్ఎస్ జాబితాలో మహిళలకు సీట్లు తక్కువ, బీసీలకు కేటాయింపు తక్కువ అంటూ కాంగ్రెస్, బీజేపీ రెండూ గొడవ చేశాయి. మీ సంగతేంటో చూద్దాంలే అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గట్టిగానే బదులిచ్చారు. ఇప్పుడా క్లిష్ట పరిస్థితి రానే వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ లో బీసీలు టికెట్లకోసం పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ 23 సీట్లు బీసీలకు కేటాయించిందని, అంతకంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 సీట్ల చొప్పున మొత్తం 51 సీట్లు కావాలనేది వారి ప్రధాన డిమాండ్. అయితే ఆశావహులు ఎక్కువ, అవకాశాలు తక్కువ అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ లో బీసీల పరిస్థితి.

51 సీట్లు ఇవ్వాల్సిందే..

51 సీట్లు కావాలని బీసీలు అడుగుతున్నారు.

34 సీట్లు ఇస్తామని గతంలో పీఏసీ నిర్ణయించింది.

ఇక్కడే ఇప్పుడు వ్యవహారం మెలిక పడింది. బీసీ ముఖ్యనేతలంతా ఇటీవలే సమావేశం పెట్టుకున్నారు. కాదూ కూడదు అంటే 48 సీట్లకి తెగ్గొడదామని నిర్ణయించారు. అంతకంటే తక్కువైతే కుదరదంటూ బీసీలంతా ఒకేమాటపై నిలబడదామన్నారు.

అధిష్టానం ఆలోచన ఏంటి..?

బీసీల్లో సమర్థులైన నేతలున్నారు సరే.. అంతకంటే సమర్థులైన వేరే వర్గం నేతల్ని బీఆర్ఎ బరిలో దింపుతోంది. వారిని ఢీకొనాలంటే ఆర్థిక వనరులు పరిపుష్టిగా ఉన్నవారిని వెదకాలి. బీసీల్లో అలాంటి నేతలు దొరక్కపోతే కచ్చితంగా ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ బీసీ నేతలు డైలమాలో పడ్డారు. బీసీలకు టికెట్లు ఇచ్చారా లేదా అనేది తర్వాతి సంగతి, ముందు పార్టీ ఉనికి ముఖ్యం. అంటే గెలుపుt గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలి. ముందు గెలిచే అభ్యర్థులను గుర్తించాలంటూ హైకమాండ్ ఆదేశించింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నారు. మరోవైపు ఇతర పార్టీలనుంచి వచ్చేవారితో కూడా పెద్ద చిక్కొచ్చి పడింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ రాజకీయం వేడెక్కింది. రాగా పోగా కాంగ్రెస్ బీసీలకు గరిష్టంగా 34 సీట్లు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

First Published:  27 Aug 2023 11:42 AM IST
Next Story