ఓవర్ టూ ఢిల్లీ... సీఎం ప్రమాణస్వీకారం లేదు..!
డి.కె.తో పాటు మరో నలుగురు పరిశీలకులను ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. రేపు సోనియా, ఖర్గేతో డి.కె. సహా పరిశీలకులు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈ చర్చల తర్వాతే సీఎం ఎవరనేదానిపై స్పష్టత రానుంది.
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధిష్టానం నుంచి ప్రకటన వచ్చాకే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై స్పష్టత రానుంది. అధిష్టానం ప్రకటన చేసిన తర్వాతే గవర్నర్‌ను కలవనున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఇప్పటికే ప్రమాణస్వీకారానికి సంబంధించి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌ను ఢిల్లీకి పిలించింది కాంగ్రెస్ అధిష్టానం. డి.కె.తో పాటు మరో నలుగురు పరిశీలకులను ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. రేపు సోనియా, ఖర్గేతో డి.కె. సహా పరిశీలకులు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈ చర్చల తర్వాతే సీఎం ఎవరనేదానిపై స్పష్టత రానుంది.
సీఎం రేవంత్ రెడ్డే అని ప్రచారం జరగడంపై పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్ నుంచి భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ లాంటి సీనియర్లు వెళ్లిపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో ఢిల్లీలో ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీఎం పేరుతో పాటు మంత్రుల లిస్ట్‌ను ఒకేసారి ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
♦