Telugu Global
Telangana

కేజీఎఫ్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచే తాను నేర్చుకున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు ఉన్నత స్థానాలకు తెచ్చిందని గుర్తు చేసుకున్నారు.

కేజీఎఫ్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) మహా సభల్లో పాల్గన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది. కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారు. వారు కష్టపడి పంటలు పండించాలి.. పది మందికి ఉపయోగపడాలి అనుకుంటారు. కమ్మ అంటే అమ్మలాంటి వారు." అని అన్నారు రేవంత్ రెడ్డి.


కమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పేందుకు పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదని, సారవంతమైన నేల, సమద్ధిగా నీళ్లు ఎక్కడ ఉంటాయే అక్కడ కమ్మ వాళ్ళు ఉంటారని చెప్పారు రేవంత్ రెడ్డి. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా సారవంతమైన నేలలు, మంచి పంటలు పండే భూములు ఉన్న చోట కమ్మవారు ఉంటారని అన్నారు. తాను ఎక్కడ ఉన్నా, ఆ సామాజిక వర్గం వారు తనను ఎంతో ఆదరించారని చెప్పారు రేంత్ రెడ్డి.

అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచే తాను నేర్చుకున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు ఉన్నత స్థానాలకు తెచ్చిందని గుర్తు చేసుకున్నారు. రాజకీయం, నాయకత్వంలో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని, రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు ఉన్నారంటే ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశాలే కారణం అని అన్నారు. ఎన్టీఆర్‌ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో కమ్మవారు కూడా భాగస్వాములు కావాలని కోరారు. వారిలో ఉన్న ప్రతిభని అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం నుంచి వారికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  20 July 2024 3:12 PM IST
Next Story