నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. రేవంత్ సంచలన నిర్ణయం
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు ఉంటాయని పోలీసులకు చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రజల మధ్యకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొవడం తన వల్ల కాదన్నారు.

సీఎం కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తన కాన్వాయ్ కోసం ఇకపై ట్రాఫిక్ ఆపొద్దన్నారు రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ప్రత్నామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు.
ఇప్పటికే సీఎం కాన్వాయ్‌లో వాహనాలను 15 నుంచి 9కి తగ్గించామని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు ఉంటాయని పోలీసులకు చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రజల మధ్యకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొవడం తన వల్ల కాదన్నారు.
పోలీసు శాఖలో నియామకాలపైనా అధికారులతో చర్చించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదో ఆలోచించాలన్నారు. నళినికి ఆసక్తి ఉంటే విధుల్లోకి తీసుకోవాలన్నారు. పోలీసు శాఖలో నిబంధనలు అంగీకరించకపోవతే.. మరో శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.