Telugu Global
Telangana

క్షత్రియులు, వారి గొప్పతనం.. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..?

క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్‌ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి.

క్షత్రియులు, వారి గొప్పతనం.. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..?
X

కమ్మ అంటే అమ్మలాంటి వారు..

కమ్మవారు మట్టిలోనుంచి బంగారం తీస్తారు..

సారవంతమైన నేల, సమ్మృద్ధిగా నీరు ఉన్నచోట కమ్మవారు ఉంటారు..

ఇటీవల కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. తాజాగా ఆయన క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. అక్కడ ఆయన ప్రసంగం ఇలా సాగింది.

కష్టపడే గుణం క్షత్రియుల సొంతం.

ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, వినయంగా ఉంటారు.

ఏరంగంలో ఉన్నా వారు రాణిస్తారు.

అంటూ క్షత్రియుల గొప్పతనాన్ని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.


దివంగత సినీనటుడు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. ఇక బాలీవుడ్‌లో సత్తా చాటిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనకు మంచి మిత్రుడు అని చెప్పారు. హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా బాహుబలిని ప్రభాస్‌ లేకుండా ఊహించలేమన్నారు రేవంత్ రెడ్డి. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్‌ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు.

ఇక రాజకీయాల విషయానికొస్తే.. కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో బోసురాజు కీలక పాత్ర పోషించారని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. రాజులను చట్ట సభల్లోకి తీసుకోవాలనే ఆలోచన తమకు ఉందని అన్నారు. ముందు పార్టీలో అవకాశం ఇస్తామని, తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని మాటిచ్చారు. విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్‌ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టాలని, వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ లో క్షత్రియ భవన్‌ ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్‌రెడ్డి.

First Published:  18 Aug 2024 8:22 PM IST
Next Story