చంద్రబాబుపై రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం
రోజుకి 24 గంటలు ఉంటే అందులో 18 గంటలు చంద్రబాబు రాష్ట్రం కోసమే ఆలోచిస్తారని, పని చేస్తారని కితాబిచ్చారు రేవంత్ రెడ్డి.
ఏపీ సీఎం చంద్రబాబుపై, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పారు. రోజుకి 24 గంటలు ఉంటే అందులో 18 గంటలు చంద్రబాబు రాష్ట్రం కోసమే ఆలోచిస్తారని, పని చేస్తారని మెచ్చుకున్నారు. ఆయనతో పోటీ పడి పనిచేసే అవకాశం తనకు లభించిందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం నాకు వచ్చింది
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024
గతంలో 12 గంటలు పని చేస్తే సరిపోతుంది అనుకునే వాడిని.. ఇప్పుడు చంద్రబాబు 18 గంటలు చేసి నేను 12 గంటలు చేస్తే బాగుండదు కాబట్టి మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే అని మా అధికారులకు, సహచరులకు చెప్పాను -… pic.twitter.com/U0RpmpsY0c
హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆస్పత్రి నిర్మించారన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీ సీఎం చంద్రబాబు పనితనం గురించి ప్రస్తావించారు. ఆయన రోజుకి 18 గంటలు కష్టపడే నాయకుడని కితాబిచ్చారు.
తెలంగాణ అభివృద్ధికోసం తాను 12 గంటలు కష్టపడితే సరిపోతుందని అనుకునేవాడినని, కానీ ఇప్పుడు 18 గంటలు కష్టపడాల్సిన అవసరం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 18 గంటలు పనిచేస్తారు కాబట్టి, తనతోపాటు తెలంగాణ నేతలు, అధికారులు కూడా రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేయాలని, అప్పుడే అభివృద్ధిలో ఏపీతో పోటీపడగలం అని అన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.