మహారాష్ట్రలో కేసీఆర్ కి ఘన స్వాగతం..
మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి మాతా (అంబాబాయి) దేవాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కి మహారాష్ట్రలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ లో ఈరోజు ఉదయం అంబులెన్స్ లను ప్రారంభించిన అనంతరం ఆయన మహారాష్ట్ర బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ రాక సందర్భంగా కొల్హాపూర్ ఎయిర్ పోర్ట్ కి మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు నేతలు, కార్యకర్తలు. ఎయిర్ పోర్ట్ లో సీఎం కేసీఆర్ కి ఘన స్వాగతం లభించింది. అక్కడినుంచి ఆయన కొల్హాపూర్ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
BRS President, CM Sri KCR received grand welcome from party cadre as he reached Kolhapur, Maharashtra today. pic.twitter.com/bQaGHxSvQK
— BRS Party (@BRSparty) August 1, 2023
మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి మాతా (అంబాబాయి) దేవాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో కాసేపు ఉన్నారు కేసీఆర్, ఉపాలయాలను సందర్శించారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. సాంగ్లీ జిల్లా వాటేగావ్ లో దళిత నేత అన్నా భావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొంటారు. అన్నభావ్ సాఠే విగ్రహానికి నివాళులర్పించి అనంతరం ఆయన వారసులతో మాట్లాడతారు. సాంగ్లీ జిల్లాలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత హైదరాబాద్ కి బయలుదేరుతారు.