ఎన్సీపీ చీలికపై కేసీఆర్ హాట్ కామెంట్స్..
అభివృద్ధి నిరోధకులను గెలిపించుకుంటూ కనీస వసతులు లేకుండా ఇంకెన్నాళ్లు ఉందామని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదో చూద్దామన్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ చీలికపై సీఎం కేసీఆర్ స్పందించారు. పదవులకోసం సొంత పార్టీలనే చీల్చుకుంటూ వేరే పార్టీల్లోకి వెళ్తున్నారని అన్నారాయన. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. దేశ రాజకీయాలన్నీ పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని అన్నారు కేసీఆర్. ప్రస్తుతం మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ అక్కడి రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.
బీఆర్ఎస్ లోకి వస్తున్న నేతలు అభివృద్ధికి ఆకర్షితులై తమతో కలసి నడుస్తున్నారని చెప్పారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతల్ని ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర నేతలకు కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో మహారాష్ట్ర షోలాపూర్, నాగ్పూర్ తదితర ప్రాంతాల నుంచి పలువురు నేతలు, ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా… pic.twitter.com/hiO2l636xP
— BRS Party (@BRSparty) July 8, 2023
అభివృద్ధి నిరోధకులను గెలిపించుకుంటూ కనీస వసతులు లేకుండా ఇంకెన్నాళ్లు ఉందామని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి వద్దకు వచ్చిందని.. తలుపులు తెరిచి ఆహ్వానించాలని మహారాష్ట్ర నేతల్ని కోరారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదో చూద్దామన్నారు. బీఆర్ఎస్ ను మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. సోలాపూర్ లో త్వరలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.