మాట ఇచ్చారు.. మాఫీ చేశారు.. ఆనందంలో తెలంగాణ అన్నదాత
తెలంగాణ రైతులకు ఇచ్చిన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాల వేళ.. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు. ఇవాళ ఒక్క రోజే.. 10 లక్షల 79 వేల 721 మంది రైతులకు ఏకంగా 6 వేల 546 కోట్ల రూపాయల విలువైన రుణాలను మాఫీ చేశారు.

ఇందుకు సంబంధించిన తొలి అడుగు.. ఈ నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పడింది. ఆ మరుసటి రోజు నుంచే రుణమాఫీ అమలుకు మంత్రి హరీశ్ రావు, సంబంధిత ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. విడతల వారీగా రుణమాఫీ అమలవుతూ రాగా.. నేటికి ప్రక్రియ పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని కూడా బ్యాంకుల్లో జమ చేసినట్టు తెలిపింది.
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఇప్పటివరకూ రుణమాఫీ అందుకున్న తెలంగాణ రైతుల సంఖ్య 16 లక్షల 16 వేలకు చేరింది. మొత్తంగా మాఫీ అయిన రుణాల విలువ 7 వేల 753 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ నిర్ణయం.. అన్నదాతలను అమితానందంలో ముంచింది.
ఇప్పటికే తెలంగాణ రైతులు.. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం సాగుకు ఉచితంగా 24 గంటల విద్యుత్ అందుకుంటున్నారు. పంటకు పెట్టుబడి సాయం పొందుతున్నారు. బీమా సదుపాయాలనూ అందుకుంటున్నారు. తాజాగా.. సాగుకు చేసిన రుణాలను సైతం మాఫీ పొందారు. ఈ ఉత్సాహానికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. నిండుగా ఉన్న జలవనరుల సాయంతో సాగులో సరికొత్త సంచలనాలకు తెలంగాణ రైతాంగం సిద్ధమవుతోందని అధికారులు చెబుతున్నారు.