రేపు తెలంగాణ కేబినేట్ భేటీ
తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానున్నది.
BY Vamshi Kotas18 March 2025 6:15 PM IST

X
Vamshi Kotas Updated On: 18 March 2025 6:15 PM IST
రేపు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానున్నది. ఉదయం 9:30 గంటలకు భేటీ అయి రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఉదయం 11:45 నిమిషాలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
గత ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story