Telugu Global
Telangana

కేబినెట్‌ సమావేశం 26కు వాయిదా

23వ తేదీకి బదులు 26న నిర్వహిస్తున్నట్టు మంత్రులు, అధికారులకు సమాచారం

కేబినెట్‌ సమావేశం 26కు వాయిదా
X

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ఈనెల 23వ తేదీకి బదులు 26వ తేదీన నిర్వహిస్తున్నట్టు మంత్రులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. 26న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్‌ లోని ఆరో ఫ్లోర్‌ లో గల కేబినెట్‌ మీటింగ్‌ హాల్‌ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కేబినెట్‌ భేటీలో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకురవడానికి ఆమోదం తెలుపుతారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ లో సవరణలు చేస్తారని తెలిసింది. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నారు. గ్రామ రెవెన్యూ అధికారి ఉద్యోగాల్లో వీఆర్వో, వీఆర్‌ఏలతో సగం పోస్టులు భర్తీ చేయాలని.. మిగతా సగం ఉద్యోగాలు కొత్త వారితో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్‌ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు. హైడ్రా, కొత్త రెవెన్యూ బిల్లులను అసెంబ్లీ, కౌన్సిల్‌ లో ప్రవేశ పెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు డ్రాఫ్ట్‌ బిల్లులపైనా కేబినెట్‌ భేటీలో చర్చిస్తారు. నవంబర్‌ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో.. సమావేశాల తేదీల ఖరారుపైన సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

First Published:  19 Oct 2024 5:08 PM IST
Next Story