ఈ నెల 6న తెలంగాణ కేబినేట్ సమావేశం
ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.

ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.
తెలంగాణ కేబినేట్ సమావేశం ఈ నెల 6న జరగనుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.