19న తెలంగాణ బడ్జెట్
27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం
BY Raju Asari12 March 2025 2:18 PM IST

X
Raju Asari Updated On: 12 March 2025 2:18 PM IST
ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనున్నది. 14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ ఉండనున్నది.
Next Story