Telugu Global
Telangana

నేడు బీజేపీ ఫస్ట్‌ లిస్ట్.. రాజాసింగ్‌కు ఊరట.!

బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ బరిలో ఉంటారని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతారని సమాచారం. అయితే కిషన్ రెడ్డి పోటీపై ఇంకా క్లారిటీ లేదు.

నేడు బీజేపీ ఫస్ట్‌ లిస్ట్.. రాజాసింగ్‌కు ఊరట.!
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 55 మంది అభ్యర్థులతో కూడిన‌ ఫస్ట్ లిస్ట్‌ను బీజేపీ ఇవాళ విడుదల చేయ‌నుంద‌ని సమాచారం. ఇప్పటికే లిస్ట్‌ను మోడీ నేతృత్వంలోని పార్లమెంటరీ పార్టీ బోర్డుకు కేంద్ర ఎన్నికల కమిటీ పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనతో పొత్తు కాకుండా అవగాహనతో పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ బరిలో ఉంటారని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతారని సమాచారం. అయితే కిషన్ రెడ్డి పోటీపై ఇంకా క్లారిటీ లేదు.

ఇక 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తారని.. ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు కూడా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో 2022 ఆగస్టులో రాజాసింగ్‌పై పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది.

బీజేపీ లిస్ట్‌ ఆలస్యం కావడంపై ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. బీఫామ్‌లు కూడా అందిస్తోంది. ఇక కాంగ్రెస్‌ తన ఫస్ట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. ఎన్డీఏలో అధికారిక భాగస్వామి అయినప్పటికీ జనసేనతో పొత్తు ఉండే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బీజేపీ బీసీ అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా చూపడం ద్వారా బీసీ ఓటు బ్యాంకును టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. జాబితాలో మహిళలకు సైతం పెద్దపీట వేస్తారని సమాచారం.

First Published:  22 Oct 2023 8:08 AM IST
Next Story