బీజేపీ ఫైనల్ లిస్ట్‌లో బిగ్ ట్విస్ట్
బెల్లంపల్లి స్థానానికి గతంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం ఫైనల్ లిస్ట్‌లో ఆమె స్థానంలో కొయ్యల హేమాజీకి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
నామినేషన్ల స్వీకరణకు మరికొద్ది గంటలు మాత్రమే టైమ్ ఉన్నప్పటికీ.. బీజేపీలో అభ్యర్థుల ఎంపికపై గందరగోళం తప్పడం లేదు. 14 మంది పేర్లతో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ.. మళ్లీ మార్పులు చేయడంతో క్యాడర్ కన్ఫ్యూజన్కు గురవుతోంది. ఐదో లిస్ట్‌లో ప్రకటించిన అలంపూర్, బెల్లంపల్లి స్థానాలకు మళ్లీ అభ్యర్థులను మార్చుతున్నట్లు ప్రకటించింది బీజేపీ.
బెల్లంపల్లి స్థానానికి గతంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం ఫైనల్ లిస్ట్‌లో ఆమె స్థానంలో కొయ్యల హేమాజీకి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత కాసేపటికే మళ్లీ శ్రీదేవికే టికెట్ అంటూ ప్రకటన విడుదల చేసింది. దీంతో అధిష్టానంపై క్యాడర్ ఫైర్ అవుతున్నారు.
అలంపూర్ స్థానం నుంచి మేరమ్మకు అవకాశం ఇస్తున్నట్లు లిస్ట్‌లో పేర్కొన్న కమలం పార్టీ.. తర్వాత మేరమ్మ ప్లేస్‌లో రాజగోపాల్ పేరు ఖరారు చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. చివరి నిమిషంలో అభ్యర్థుల విషయంలో కన్ఫ్యూజన్ కావడంపై మండిపడుతున్నారు.