Telugu Global
Telangana

బీజేపీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీ.. ఆశావహులు ఎవరెవరంటే..?

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ని ప్రోత్సహించింది బీజేపీ, కానీ అక్కడ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆశావహులకు అవకాశమివ్వాలని చూస్తోంది.

బీజేపీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీ.. ఆశావహులు ఎవరెవరంటే..?
X

తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వచ్చింది. తొలి జాబితాలోనే రెండు ఫ్యామిలీ ప్యాకేజీలు బయటపడ్డాయి. మైనంపల్లి తండ్రీ కొడుకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన భార్యకు కూడా కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. మలిదశలో మరిన్ని ఇలాంటి ఉదాహరణలు ఉంటాయని తెలుస్తోంది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ని పక్కనపెట్టి ఒక్కో ఫ్యామిలీకి రెండేసి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్. మరి బీజేపీ పరిస్థితి ఏంటి..? బీజేపీలో కూడా ఇలా ఆశావహ కుటుంబాలున్నాయి. ఆయా కుటుంబాలు కూడా ఫ్యామిలీ టికెట్లు కావాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

బీజేపీలో ఉదయ్ పూర్ లాంటి డిక్లరేషన్లేవీ లేవు కానీ.. ఆ పార్టీ నోరు తెరిస్తే నో ఫ్యామిలీ పాలిటిక్స్ అంటుంది. వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని కబుర్లు చెబుతుంది. కానీ చేసేవన్నీ రివర్స్ పనులే. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ని ప్రోత్సహించింది బీజేపీ, కానీ అక్కడ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆశావహులకు అవకాశమివ్వాలని చూస్తోంది.

ఎవరెవరు..?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితోపాటు ఆయన సతీమణి కావ్యారెడ్డి కూడా ఈసారి అసెంబ్లీ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ తోపాటు, ఆయన భార్య జమున కూడా పోటీ చేయాలనుకుంటున్నారట. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి దంపతులు కూడా ఫ్యామిలీ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తనతోపాటు కొడుకు మిథున్‌ రెడ్డికి కూడా టికెట్ కావాలంటున్నారు. డీకే అరుణ తనతోపాటు తన కుమార్తె పేరు కూడా తెరపైకి తెచ్చారు. మరి వీరిలో ఎవరెవరు నిజంగా పోటీ చేయాలనుకుంటున్నారు..? ఎవరికి టికెట్లు ఖరారవుతాయనే విషయం తేలాల్సి ఉంది.

First Published:  18 Oct 2023 10:57 AM IST
Next Story