బీజేపీ మేనిఫెస్టో లీక్.. ఏం హామీలు ఉన్నాయంటే..!
గతంలోనూ పేర్ల మార్పుపై చర్చ జరిగింది. బండి సంజయ్, రాజాసింగ్ లాంటి నేతలు అడపాదడపా తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని ప్రకటనలు చేశారు.

బీజేపీ మేనిఫెస్టో లీక్.. ఏం హామీలు ఉన్నాయంటే..!
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 12 లేదా 13న మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ఆ పార్టీ భావించింది. అయితే ఇంతలోనే మేనిఫెస్టోలోని పలు అంశాలు లీకయ్యాయి. ప్రధానంగా బీజేపీ తెలంగాణలో పలు నగరాల పేర్లను మార్చాలన్న హామీని మేనిఫెస్టోలో పెట్టినట్లు సమాచారం.
హైదరాబాద్ పేరు భాగ్యనగర్, నిజామాబాద్ పేరు ఇందూర్, వికారాబాద్ పేరు గంగవరం, కరీంనగర్ పేరును కరీంనగరంగా మార్చుతామని మేనిఫెస్టోలో పెట్టినట్లు సమాచారం. వీటితో పాటు మహబూబ్‌నగర్ పేరును పాలమూరుగా, ఆదిలాబాద్ పేరును ఎదులాపురం, మహబూబబాద్ పేరును మానుకోటగా మార్చాలని చూసినట్లు సమాచారం.
గతంలోనూ పేర్ల మార్పుపై చర్చ జరిగింది. బండి సంజయ్, రాజాసింగ్ లాంటి నేతలు అడపాదడపా తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని ప్రకటనలు చేశారు. బీజేపీ నేతల కామెంట్లపై సీఎం కేసీఆర్ సైతం గతంలోనే సెటైర్లు వేశారు. ప్రజలకు కావాల్సింది నేమ్ ఛేంజర్లు కాదు.. గేమ్ ఛేంజర్లు అంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు.