సీనియర్లు లేకుండానే ఇన్‌ఛార్జుల లిస్టు.. బీజేపీ వ్యూహం ఏంటి..?
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కిషన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులను నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జులుగా బాధ్యతలు అప్పగించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. లిస్టులో సీనియర్ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, మురళీధర్‌రావు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌ఛార్జులు వీరే..
హైదరాబాద్-రాజాసింగ్
సికింద్రాబాద్- లక్ష్మణ్
వరంగల్-మర్రి శశిధర్ రెడ్డి
నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి-ఎన్వీఎస్ ప్రభాకర్
ఖమ్మం-పొంగులేటి సుధాకర్ రెడ్డి
నిజామాబాద్-ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మహబూబాబాద్-గరికపాటి రామ్మోహన్ రెడ్డి
కరీంనగర్-ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
మల్కాజ్ గిరి -రాకేష్ రెడ్డి
మహబూబ్ నగర్-రామచందర్ రావు
ఆదిలాబాద్- పాయల్ శంకర్
జహీరాబాద్- వెంకటరమణారెడ్డి
పెద్దపల్లి-రామారావు
మెదక్-హరీష్ బాబు
చేవెళ్ల-వెంకట నారాయణరెడ్డి
నాగర్ కర్నూల్- రంగారెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కిషన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని హైకమాండ్ టార్గెట్ పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లి.. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఏం చేయాలనే అంశాలపై పార్టీ పెద్దలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి?. గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలను అమలుచేయాలనే అంశాలపై చర్చించారు.