మాతాశిశు మరణాల కట్టడిలో బీజేపీ పాలిత రాష్ట్రాలను వెనక్కి నెట్టిన తెలంగాణ
దేశంలోని అతి తక్కువ వయసున్న రాష్ట్రం, మరో వైపు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వపు నిరంతర ఆరోపణలు, దాడులను ఎదుర్కొంటూ ఇతర రాష్ట్రాలకన్నా, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌తో సహా బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటినీ అధిగమించింది.
మాతాశిశు మరణాలను నియంత్రించడంలో బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణ వెనక్కి నెట్టింది. మాతాశిశు మరణాల నిష్పత్తి (MMR)ని లక్షమందిలో 56 మందికి కి తగ్గించడంలో తెలంగాణ విజయం సాధించినట్టు నీతి ఆయోగ్, సెన్సస్ కమీషనర్, ఇతర కేంద్ర ఏజెన్సీలతోపాటు హోం మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుర్తించాయి. 2014,15లో తెలంగాణలో లక్షకు 81గా ఉండింది. ప్రస్తుతం మాతా శిశు మరణాల నిష్పత్తి నేషనల్ యావరేజ్ లక్షలో 103గా ఉంది.
దేశంలోని అతి తక్కువ వయసున్న రాష్ట్రం, మరో వైపు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వపు నిరంతర ఆరోపణలు, దాడులను ఎదుర్కొంటూ ఇతర రాష్ట్రాలకన్నా, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌తో సహా బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటినీ అధిగమించింది. మోడీ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 'ఆరోగ్యకరమైన గుజరాత్, సంపన్న గుజరాత్' నినాదంతో గుజరాత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ప్రోత్సహించినప్పటికీ, అక్కడ రెండు దశాబ్దాలకు పైగా బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం మాతాశిశు మరణాలను తగ్గించడంలో విఫలమైంది.
మరోవైపు గత మూడేళ్ల నుంచి దేశంలోనే అతి తక్కువ మాతాశిశు మరణాల్లో కేరళ, మహారాష్ట్రల తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్‌లో మాతాశిశు మరణాల నిష్పత్తి MMR ప్రతి లక్షకు 70 కంటే ఎక్కువగా ఉండేది. 2011-13లో గుజరాత్ MMR 112 వద్ద ఉంది.
గత ఎనిమిదేళ్లలో టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో ఎంఎంఆర్‌లో స్థిరమైన క్షీణతను ఆర్‌బీఐ తన హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ తాజా ఎడిషన్‌లో నమోదు చేసింది. మరోవైపు, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ, దేశంలో ఎంఎంఆర్‌ను తగ్గించడంలో పెద్దగా ఏమీ చేయలేకపోయింది. భారతదేశంలోని మొత్తం 640 జిల్లాల్లో, 448 జిల్లాల్లో MMR UN సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) కింద నిర్దేశించబడిన లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. 2030కి UN సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) కింద MMR 70 కాగా, భారతదేశం ప్రస్తుత MMR 103.
RBI డేటా ప్రకారం, ఉత్తరాఖండ్ లో లక్షకు101, పశ్చిమ బెంగాల్ లో109 , పంజాబ్ 114, బీహార్ 130, ఒడిశా 136, రాజస్థాన్ 141. ఈ ఐదు రాష్ట్రాల్లో MMR 100 , 150 మధ్య ఉంది, అయితే MMR చత్తీస్‌గఢ్160 , మధ్యప్రదేశ్ 163, ఉత్తరప్రదేశ్ 167, అస్సాం 205. ఈ నాలుగు రాష్ట్రాల్లో 150 కంటే ఎక్కువ. అదే సమయంలో కేరళ, మహారాష్ట్ర లలో MMR 15 శాతానికి పైగా క్షీణించగా, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, పంజాబ్ , ఆంధ్రప్రదేశ్ లలో10-15 శాతం క్షీణించాయి.
తెలంగాణ ప్రభుత్వం 2015 జనవరి నుంచి ఆరోగ్యలక్ష్మి పథకం కింద 35,700 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లీబిడ్డలకు పౌష్టికాహారాన్ని అందజేస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 4.72 లక్షల మంది మహిళలు, 17.63 లక్షల మంది ఆరేళ్లలోపు పిల్లలు లబ్ధి పొందుతున్నారు.