Telugu Global
Telangana

తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి తగ్గించేందుకు ఉచిత కౌన్సెలింగ్ అందిస్తున్న ప్రభుత్వం

విద్యార్థులు 14416 నంబర్‌కు కాల్ చేసి మానసిక నిపుణులు, మానసిక వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది.

తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి తగ్గించేందుకు ఉచిత కౌన్సెలింగ్ అందిస్తున్న ప్రభుత్వం
X

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల భయం, ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వ‍ం ఉచిత కౌన్సెలింగ్ సేవలు ప్రారంభించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ (టెలి-మనస్) అందించే మనస్తత్వవేత్తలు, సైకియాట్రిస్ట్ లు కౌన్సెలింగ్ సేవలను అందిస్తారు.

విద్యార్థులు 14416 నంబర్‌కు కాల్ చేసి మానసిక నిపుణులు, మానసిక వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది.

ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మానసిక వైద్యుల సేవలను ఉచితంగా అందించేందుకు జిల్లా మానసిక ఆరోగ్య క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని తెల‍ంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) కార్యదర్శి నవీన్ మిట్టల్ కోరారు.

First Published:  4 March 2023 1:53 PM GMT
Next Story