Telugu Global
Telangana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

ఆర్టీసీ బిల్లుపై చర్చించాల్సిన సందర్భంలో సమగ్ర చర్చకు అవకాశమిస్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. బీఏసీ సమావేశంలో కేవలం మూడు రోజులు అసెంబ్లీ జరుగుతుందని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు దాన్ని సవరించారు. ఆర్టీసీ బిల్లుపై చర్చించాల్సిన సందర్భంలో సమగ్ర చర్చకు అవకాశమిస్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియాల్సి ఉంది. అయితే ఆర్టీసీ బిల్లు విషయంలో అనుకోని ఆలస్యం జరిగింది. ఈ బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర బాగా ఆలస్యమైంది. ప్రశ్నలు, సమాధానాలు, మళ్లీ ప్రశ్నలు, అనుమానాలు, చివరకు ఆర్టీసీ కార్మికుల నిరసనలతో ఈ ఎపిసోడ్ గందరగోళంగా మారింది. ఎట్టకేలకు గవర్నర్ ఆమోదముద్రపడటంతో బిల్లు అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చించేందుకు మరో రెండురోజులపాటు సమావేశాలను పొడిగించారు.

సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఎన్నికల ఏడాదిలో ఇవే ఈ దఫా చివరి సమావేశాలుగా భావిస్తున్నారు. ఈనెల 3వతేదీ సమావేశాలు మొదలయ్యాయి. అదే రోజు బీఏసీ మీటింగ్ జరిగింది. దివంగత ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడింది. 4, 5 తేదీల్లో సమావేశాలు జరిగాయి. ఆరో తేదీ ఆదివారం కూడా నేడు సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఆర్టీసీ బిల్లుకోసం 7, 8 తేదీల్లో కూడా అసెంబ్లీ సమావేశం కాబోతోంది.

First Published:  6 Aug 2023 6:29 PM IST
Next Story