Telugu Global
Telangana

ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 09 నుంచి ప్రారంభం కానున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
X

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సంబంధించి గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 09న ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు బీఏసీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ప్రతీ రోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి.. రాబోయే కాలంలో చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అవుతోంది.

శాసన సభ సమావేశాల్లో పంచాయతీ ఎన్నికల పై చర్చించే అవకాశం ఉంది. నూతన ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు, పలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరూ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురానున్నారు. ఇలా పలు చట్టాలను ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురానుంది.

First Published:  4 Dec 2024 9:34 PM IST
Next Story