ప్రజా ఫిర్యాదులను స్పీడ్ గా పరిష్కరించడంలో టాప్ త్రీ స్టేట్స్ లో తెలంగాణ
తెలంగాణ కేవలం సగటున 15 రోజుల్లో ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. అయితే బిజెపి అధికారంలో ఉన్న త్రిపురలో ప్రజా పిర్యాదులను పరిష్కరించేందుకు పట్టే సమయం 180 రోజులు కాగా, పంజాబ్ 159 రోజులు.
ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే విషయంలో దేశంలోని మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రకటించింది..
తెలంగాణ కేవలం సగటున 15 రోజుల్లో ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. అయితే బిజెపి అధికారంలో ఉన్న త్రిపురలో ప్రజా పిర్యాదులను పరిష్కరించేందుకు పట్టే సమయం 180 రోజులు కాగా, పంజాబ్ 159 రోజులు.
మొదటి స్థానంలో నిల్చింది జమ్మూ & కాశ్మీర్. సగటున 8 రోజుల్లో అక్కడ ప్రజా పిర్యాదులు పరిష్కారమవుతున్నాయి. మణిపూర్ ప్రభుత్వం రెండవ స్థానంలో ఉంది, ఆ రాష్ట్రంలో సగటున 13 రోజుల్లో ప్రజా పిర్యాదులు పరిష్కారమవుతున్నాయి. 15 రోజుల్లో ప్రజా పిర్యాదులను పరిష్కరిస్తూ తెలంగాణ ప్రభుత్వం మూడవ స్థానంలో ఉంది.
ఈ వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ తన సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) ఫిబ్రవరి నివేదికలో షేర్ చేసింది.
హైయెస్ట్ డిస్పోజల్స్ ఆఫ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) ఫార్మాట్‌లో కూడా అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ల తర్వాత తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది. తెలంగాణ మొత్తం 606 ATR పరిష్కరించగా ,వీటిలో 37 పూర్తిగా పరిష్కరించబడ్డాయి. 569 పాక్షికంగా పరిష్కరించబడ్డాయి. ఒక్కటి కూడా పెండింగ్‌లో లేదు.
ఫిబ్రవరి 25 నాటికి 1000 కంటే ఎక్కువ పెండింగ్ ఫిర్యాదులు ఉన్న 22 రాష్ట్రాలు, UTలలో, మహారాష్ట్రలో గరిష్టంగా 20,933 ఫిర్యాదులు 30 రోజుల కంటే ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్నాయి.