Telugu Global
Telangana

'అతి తక్కువ‌ మాతాశిశు మరణాల రేటు కలిగిన మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి'

ప్రస్తుతం దేశంలో అత్యల్ప ప్రసూతి మరణాల రేటు (MMR) ఉన్న మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ నిల్చింది. అయితే, గర్భిణీ స్త్రీలకు హెల్త్‌కేర్ డెలివరీ మెకానిజంలో లోపాలను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్ రావు సోమవారం తెలిపారు.

అతి తక్కువ‌ మాతాశిశు మరణాల రేటు కలిగిన మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
X

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతాశిశు మరణాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యల్ప ప్రసూతి మరణాల రేటు (MMR) ఉన్న మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ నిల్చింది. అయితే, గర్భిణీ స్త్రీలకు హెల్త్‌కేర్ డెలివరీ మెకానిజంలో లోపాలను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్ రావు సోమవారం తెలిపారు.

పేట్ల‌బుర్జ్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 'ఇన్‌ఫెక్షన్ నివారణ, ముందస్తు గుర్తింపు, నిర్వహణ కార్యక్రమం'పై CME ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తల్లి, శిశు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలను వివరించారు.

“కొద్ది నెలల్లో, మేము గాంధీ ఆసుపత్రిలో 250 పడకల MCH కేంద్రాన్ని, నిమ్స్ ఆసుపత్రిలో మరో 200 పడకల సదుపాయాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. కేసీఆర్ కిట్లు, మంత్రసాని పథకం, అమ్మ ఒడి పథకం, గర్భిణులకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలు లక్ష బాలింతలకు 43 మాతాశిశు మరణాలకు తగ్గించడంలో గొప్ప‌ పాత్ర పోషించాయని హరీశ్‌రావు అన్నారు.

ప్రస్తుతం సంస్థాగత డెలివరీలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయి. "రాబోయే వారాల్లో, 1,400 అసిస్టెంట్ ప్రొఫెసర్‌లను నియమించనున్నాము. ఇది ప్రభుత్వ ఆసుపత్రులలో, ముఖ్యంగా ప్రసూతి ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తుంది," అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం, ర్యాంకింగ్స్‌లో, 43 ప్రసూతి మరణాల రేటు (MMR)తో తెలంగాణ మూడవ స్థానంలో ఉండగా, కేరళ 19, మహారాష్ట్ర 33 తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. '' మాతాశిశు మరణాలనుమరింతగా తగ్గించి భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం కావడమే మా ప్రాధాన్యత. గిరిజన జనాభా గణనీయంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో మాతాశిశు సంరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, ”అని ఆయన అన్నారు.

తెలంగాణలోని మొత్తం 4 లక్షల మంది గర్భిణీ స్త్రీలు ప్రత్యేక పోషకాహార కిట్‌లను అందుకుంటున్నారని , మాతాశిశు మరణాలను మరింత తగ్గించడానికి ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు.

First Published:  20 Feb 2023 5:08 PM IST
Next Story