Telugu Global
Telangana

దేశంలో తక్కువ అప్పులున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి

సోమవారం లోక్‌సభలో సభ్యులు లేవనెత్తిన విభిన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ, 2020-21, 2021-22, 2022-23 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణ అత్యల్ప రుణాలున్న ఐదవ రాష్ట్రమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

దేశంలో తక్కువ అప్పులున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
X

వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో స్థూల దేశీయ ఉత్పత్తి(GSDP) నిష్పత్తితో పోలిస్తే అత్యల్ప అప్పులున్న ఐదు ప్రధాన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. 2021-22 చివరి నాటికి రాష్ట్రం మొత్తం బకాయిలు రూ.2,83,452 కోట్లుగా ఉన్నాయి.

సోమవారం లోక్‌సభలో సభ్యులు లేవనెత్తిన విభిన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ, 2020-21, 2021-22, 2022-23 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణ అత్యల్ప రుణాలున్న ఐదవ రాష్ట్రమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. GSDP నిష్పత్తికి 2020-21లో 28.2 శాతం , 2021-22 లో 27.4 శాతం , 2022-23లో 28.2 శాతం అప్పులున్నాయని, అవే ఆర్థిక సంవత్సరాల్లో మహారాష్ట్ర‌ 20.2, 18.7 19.0తో దేశంలోనే అత్యల్ప రుణాన్ని నమోదు చేసింది.

2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బకాయిలు రూ.83,698 కోట్లు కాగా, 2021-22 నాటికి రూ.2,83,452 కోట్లకు పెరిగాయని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి ఎలాంటి రుణాలు పొందలేదని, అయితే ఈ కాలంలో వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు, కార్పొరేషన్ల నుంచి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

First Published:  14 Feb 2023 6:37 AM IST
Next Story