Telugu Global
Telangana

ఇకపై TGPSC, TGRTC

మార్పు ప్రక్రియ విషయంలో కేంద్రం లాంఛనంగా అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్‌సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన TG అనే పదాన్నే వినియోగించాలని ఆదేశాలిచ్చారు.

ఇకపై TGPSC, TGRTC
X

తెలంగాణ గురించి చెప్పాలంటే ఇకపై TS అనే అక్షరాలు కనిపించవు. ఆ స్థానంలో TG వచ్చి చేరింది. అధికారికంగా ఇది అమలులోకి వచ్చింది. మే-31లోపు తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మార్పుని గుర్తించాలి, పాటించాలి. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం మారింది.. పేరూ మారింది

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా తన మార్కు చూపించే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. వాహనాల నేమ్ ప్లేట్లపై TS స్థానంలో TG అనే అక్షరాలను తీసుకొస్తామని ఆయన చెప్పారు. అయితే ఇది అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తించేలా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. అన్ని సంస్థలు ఈ మార్పుని అంగీకరించాల్సిందే కాబట్టి త్వరలో TSRTC, TSPSC వంటి సంస్థలు కూడా ఈ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్రం అనుమతితో..

ఈ మార్పు ప్రక్రియ విషయంలో కేంద్రం లాంఛనంగా అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్‌సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన TG అనే పదాన్నే వినియోగించాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశాలిచ్చారు. కొత్త అబ్రివేషన్ ని అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాలూ అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్టెమెంట్ల కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని సీఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. పేరు మార్పుతోపాటు.. తెలంగాణ రాష్ట్ర గేయం, లోగో (ఎంబ్లమ్), తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు వస్తున్నారు.

First Published:  18 May 2024 6:19 AM IST
Next Story