తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలివే
ఫీజు చెల్లింపునకు నవంబర్ 18 వరకు గడువు
BY Raju Asari8 Nov 2024 7:47 PM IST
X
Raju Asari Updated On: 8 Nov 2024 7:47 PM IST
తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన తేదీలు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు తేదీలను ప్రకటించారు. ఫీజు చెల్లింపునకు నవంబర్ 18 వరకు గడువు విధించారు. రూ. 50 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 12 వరకు , రూ. 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 21వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు సంచాలకులు తెలిపారు.
Next Story