టీమిండియా స్పిన్ మ్యాజిక్‌తో ..కివీస్ 235 పరుగులకు ఆలౌట్
ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కివీస్ 235 పరుగులకే ఆలౌటైంది.
ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగారు. న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు రవీంద్ర జాడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్ మ్యాజిక్’తో కీవిస్ బ్యాటర్లును కట్టడి చేశారు. విల్ యంగ్ (71) డారిల్ మిచెల్ (82) అర్థ సెంచరీలతో రాణించారు. జడేజా 5 , వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ ఒక వికెట్ తీశారు. భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో మూడో టెస్ట్ జరగనున్నది. టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
మొదటిరోజు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని, తర్వాత స్పిన్‌కు సహకరిస్తుందనే ఉద్దేశంతో ఆథిత్య జట్టు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే 2-0 టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా.. చివరి టెస్ట్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నది. ముంబయిలో ఎండ దెబ్బకు క్రికెటర్లు అల్లాడిపోతున్నారు. కనీసం 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతోపాటు ఉక్కపోతకు తరచూ బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరీ ముఖ్యంగా కివీస్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. విల్ యంగ్ - డారిల్ మిచెల్ జోడీ దాదాపు 25 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉన్నారు. దీంతో తీవ్ర వేడిని డ్రింక్స్ బ్రేక్ సమయంలో తట్టుకోలేక మైదానం మధ్యలోనే కూర్చుండిపోయారు. అయినా ఈ సెషన్‌లో 28 ఓవర్ల ఆట సాగింది.