Telugu Global
Telangana

జూనియర్ ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్‌.. క్లారిటీ ఇదే!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సిటీలోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్‌.. క్లారిటీ ఇదే!
X

టాలీవుడ్‌ హీరో, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జిమ్ చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్‌ మణికట్టుకు గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. గాయంతోనే ఎన్టీఆర్ దేవర షూటింగ్ పూర్తి చేశారని తెలిపింది. యాక్సిడెంట్ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది ఆయన టీమ్‌.



ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సిటీలోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే మిగతా సినిమా షూటింగ్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారని ఆయన టీమ్ తెలిపింది.


కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మంగళవారం షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జూనియర్ గాయానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన టీమ్ కోరింది.

First Published:  14 Aug 2024 10:26 AM GMT
Next Story