తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమం
ఖమ్మంలోని నివాసంలో సాయంత్రం తమ్మినేనికి గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్ట్‌తో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందన్నారు AIG వైద్యులు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ మేరకు తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్ట్‌తో ఖమ్మం నుంచి గచ్చిబౌలి AIGకి తీసుకువచ్చారని చెప్పారు వైద్యులు.
గుండె పని చేయడంలో ఇబ్బందులతో పాటు అసాధారణంగా కొట్టుకుంటోదని చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని చెప్పారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ్మినేని బీపీ సైతం నియంత్రణలో లేదని స్పష్టం చేశారు.
వివిధ వైద్య నిపుణుల పర్యవేక్షణలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నామన్నారు AIG వైద్యులు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ కుమార్‌ల పర్యవేక్షణలో కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్టు, నెఫ్రాలజిస్టు, పల్మొనాలజిస్టు తమ్మినేనికి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ మందులతో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఖమ్మంలోని నివాసంలో సాయంత్రం తమ్మినేనికి గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్ట్‌తో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు గచ్చిబౌలి AIG హాస్పిటల్‌కు వెళ్లి తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు తమ్మినేని. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు సైతం తెలిపారు.