Telugu Global
Telangana

సీఎం రేవంత్ రెడ్డిపై తమ్మినేని వీరభద్రం ఫైర్

తెలంగాణ పోలీసులసై కాంగ్రెస్ పార్టీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలలాగా పని చేస్తే శిక్ష అనుభవించడం ఖాయమని ఆయన హెచ్చారించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై తమ్మినేని వీరభద్రం ఫైర్
X

తెలంగాణ పోలీసులసై కాంగ్రెస్ పార్టీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలలాగా పని చేస్తే శిక్ష అనుభవించడం ఖాయమని ఆయన హెచ్చారించారు. పోలీసులు కావాలంటే పోలీసు డ్రెస్ ఇప్పి మూడు రంగుల జెండా వేసుకొని తిరగండి అంటూ చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చింది.

ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాలు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న నేటికీ అమలు జరగలేదని తమ్మినేని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఒక్కటే అమలు జరిగిందన్నారు. రెండు లక్షల రుణమాఫీ కొంతమందికి లబ్ధి చేకూరింది. రైతు భరోసా నేటికీ అమలు జరగలేదు. మహిళలకు మహిళా శక్తి పథకం.. కార్మికులకు ఉపాధి పథకం అమలు కాలేదు.కేంద్రంలో ఎన్డీయేని గద్దె దించేందుకు గత లోక్ సభ ఎన్నికలలో 28 పార్టీలతో ఇండియా కూటమిగా ఏర్పాటు చేసిందన్నారు. ఇండియా కూటమి బలంగా ఉండటం వల్ల బీజేపీ సీట్లను తగ్గించగలిమని అని తమ్మినేని తెలిపారు.

First Published:  28 Oct 2024 7:22 PM IST
Next Story