తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు నిందితుడు కోటేశ్వరరావు లొంగుబాటు
హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, తమ్మినేని వీరభద్రం సోదరుడు, టీఆర్‌ఎస్ నేత. ఆగస్టు 15న జాతీయ జెండా ఆవిష్కరించి తిరిగి వస్తుండగా తెల్దారుపల్లి గ్రామంలో దుండగులు కృష్ణయ్యను హతమార్చిన విషయం తెలిసిందే.
తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు శుక్రవారం ఖమ్మం కోర్టులో లొంగిపోయాడు. అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, తమ్మినేని వీరభద్రం సోదరుడు, టీఆర్‌ఎస్ నేత. ఆగస్టు 15న జాతీయ జెండా ఆవిష్కరించి తిరిగి వస్తుండగా తెల్దారుపల్లి గ్రామంలో దుండగులు కృష్ణయ్యను హతమార్చిన విషయం తెలిసిందే. రాజకీయ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం బాబాయి కొడుకైన తమ్మినేని కోటేశ్వరరావు ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని కృష్ణయ్య కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించిన విషయం తెలిసిందే. అదేరోజు కృష్ణయ్య అనుచరులు కోటేశ్వరరావు ఇంటిపై దాడికి దిగారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్య జరిగిన మరుసటిరోజే ఆరుగురిని అరెస్ట్ చేశారు.