Telugu Global
Telangana

దళిత బంధుపై ప్రశంసల వర్షం కురిపించిన తమిళనాడు ప్రతినిధి బృందం

దళిత బంధుతోపాటు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ అమలుపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురు సభ్యుల బృందం కరీంనగర్ జిల్లాకు వచ్చింది. రెండు రోజుల స్టడీ టూర్‌లో భాగంగా తొలిరోజు గురువారం కరీంనగర్‌లోని వివిధ యూనిట్లను సందర్శించారు

దళిత బంధుపై ప్రశంసల వర్షం కురిపించిన తమిళనాడు ప్రతినిధి బృందం
X

రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులతో సహా ప్రతినిధి బృందం ప్రశంసలతో ముంచెత్తింది. సమాజంలోని వివిధ వర్గాల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలను కూడా వారు అభినందించారు.

దళిత బంధుతోపాటు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ అమలుపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురు సభ్యుల బృందం కరీంనగర్ జిల్లాకు వచ్చింది. రెండు రోజుల స్టడీ టూర్‌లో భాగంగా తొలిరోజు గురువారం కరీంనగర్‌లోని వివిధ యూనిట్లను సందర్శించారు. పర్యటన ప్రారంభించే ముందు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తోనూ బృందం సమావేశమైంది.

దళిత బంధు పథకం కింద దళితులకు అందిస్తున్న ప్రయోజనాలను మంత్రి బృందానికి వివరించారు. పథకం కాన్సెప్ట్‌తో ముగ్దులైన‌ ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని అభినందించారు.

దళిత బంధుతో పాటు తెలంగాణలో ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ బాగున్నాయని అభిప్రాయపడ్డారు.

వారు చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్, కరీంనగర్ పట్టణంలోని అమెరికన్ టూరిస్టర్ లగేజీ బ్యాగ్ స్టోర్, జయ డయాగ్నోస్టిక్స్ అనే రెండు దళిత బంధు యూనిట్లను సందర్శించారు. ఈ బృందం శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని మరిన్ని యూనిట్లను సందర్శించనుంది.

విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ ఎమ్మెల్యేలు సింథనై సెల్వన్ (కట్టుమర్నార్కోయిల్ నియోజకవర్గం), అ SS బాలాజీ (తిరుపోరూర్ సెగ్మెంట్), చెన్నైలోని కార్నర్‌స్టోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రిచర్డ్ దేవదాస్, సోషల్ అవేర్‌నెస్ సొసైటీ ఫర్ యూత్ (SASY) స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రమేశ్, ఎగ్జిక్యూటివ్ మురుగప్పన్ నాథన్, సోషల్ వాచ్, తమిళనాడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Fr. కుమార్ దళిత బంధు యూనిట్లను సందర్శించారు.

First Published:  20 Jan 2023 6:35 AM IST
Next Story