జీవో 317పై త్వరగా నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయండి
మంత్రి దామోదరను కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
BY Naveen Kamera7 Oct 2024 9:13 PM IST
X
Naveen Kamera Updated On: 7 Oct 2024 9:13 PM IST
జీవో 317పై త్వరగా నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యుడు శ్రీధర్ బాబును సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. 317 జీవోలో భాగంగా స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సబ్ కమిటీ వీటిపై త్వరగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కమిటీ చైర్మన్ దామోదర ఉద్యోగుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామకృష్ణ, నిర్మల, రమేశ్, స్పౌజ్ ఫోరం ప్రతినిధులు వివేక్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Next Story