మార్గదర్శి తెలంగాణ.. అందుకే టి-వర్క్స్
టి-వర్క్స్ లో అసలు ఏం జరుగుతుంది? మన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? వినూత్న ఆలోచనలు ఎలా వస్తాయి..? అనే అంశాలపై హైస్కూల్ విద్యార్థులకు ప్రత్యేక సెషన్ నిర్వహించారు.
చిన్నతనం నుంచే విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. దానికి అవసరమైన అన్ని వనరులను సమకూరుస్తోందని చెప్పారు. టి-వర్క్స్ ట్వీట్ కి ఆయన స్పందించారు. చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆసక్తి పెంచేందుకు టి-వర్క్స్ కృషి చేస్తోందన్నారు.
Trying to inculcate Design thinking from an early age
— KTR (@KTRBRS) September 7, 2023
Telangana is showing the way https://t.co/gs065JaXLw
టి-వర్క్స్ లో విద్యార్థులకు పాఠాలు..
స్టార్టప్ ఆలోచనలు ఉన్నవారికి సహాయం చేసేందుకు, వారి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు సహకరించేందుకు టి-వర్క్స్ ని స్థాపించింది తెలంగాణ ప్రభుత్వం. వినూత్న ఆలోచనలతో వచ్చే యువతకు టి-వర్క్స్ అండగా నిలబడుతుంది. అయితే ఆ ఆలోచనలు విద్యార్థి దశలోనే వస్తే ఏం చేయాలి, ఆవిష్కరణల విషయంలో ముందడుగు ఎలా వేయాలనే విషయంపై టి-వర్క్స్ ప్రత్యేక వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది. తాజాగా కొండాపూర్ లోని జడ్పీ హైస్కూల్ కి చెందిన 80 మంది విద్యార్థులు టి-వర్క్స్ ను సందర్శించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు ఆయా రంగాలు, ఆవిష్కరణలపై అనుభవాన్ని గడించారని టి-వర్క్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
టి-వర్క్స్ లో అసలు ఏం జరుగుతుంది? మన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? వినూత్న ఆలోచనలు ఎలా వస్తాయి..? అనే అంశాలపై హైస్కూల్ విద్యార్థులకు ప్రత్యేక సెషన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను టి-వర్క్స్ ఖాతానుంచి అప్ లోడ్ చేశారు. ఈ ట్వీట్ కి మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని ఆయన వివరించారు.