Telugu Global
Telangana

డిజిటల్ పేమెంట్స్ లో విన్నర్ T-వ్యాలెట్

2017 జూన్-1న తెలంగాణ ప్రభుత్వం T-వ్యాలెట్ ప్రారంభించింది. 74 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 1054 సర్వీస్ లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ పేమెంట్స్ లో విన్నర్ T-వ్యాలెట్
X

డిజిటల్ పేమెంట్స్ కోసం తెలగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన T-వ్యాలెట్ యాప్ సూపర్ సక్సెస్ అయింది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి కార్పొరేట్ కంపెనీల యాప్ లతో పోటీపడి మరీ T-వ్యాలెట్ వేల కోట్ల లావాదేవీలకు నమ్మకమైన డిజిటల్ ప్లాట్ ఫామ్ గా మారింది. సగటున నెలకు 400 కోట్ల రూపాయల లావాదేవీలు T-వ్యాలెట్ ద్వారా జరుగుతున్నాయి. గత ఆరేళల్లో 20,300 కోట్ల లావాదేవీలు జరగడం గర్వకారణం అన్నారు మంత్రి కేటీఆర్. T-వ్యాలెట్ ఈజ్ ఎ విన్నర్ అంటూ ట్వీట్ వేశారు.


T-వ్యాలెట్ ప్రస్థానం ఇదీ..

2017 జూన్-1న తెలంగాణ ప్రభుత్వం T-వ్యాలెట్ ప్రారంభించింది. 74 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 1054 సర్వీస్ లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. కరెంటు బిల్లులు, ఈ చలాన్లతోపాటు.. నగదు బదిలీలకు కూడా T-వ్యాలెట్ ఇతర యాప్ లకు సరైన ప్రత్యామ్నాయం అనిపించుకుంది. ఇప్పటి వరకు 14 లక్షలమంది ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంది.

రూపే వర్చువల్ కార్డ్..

మీసేవ, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాల పనులు T-వ్యాలెట్ ద్వారా సులభమయ్యాయి. రూపే వర్చువల్ కార్డ్ తో ఖాతాదారులకు మరింత దగ్గరైంది T-వ్యాలెట్. మినిమమ్ ట్రాన్సాక్షన్ 10రూపాయలనుంచి మొదలవుతుంది. మినిమమ్ ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ 100 రూపాయలుగా ఉంది. ఇప్పటి వరకు 15వేల మంది వ్యాపారులు ఇందులో రిజిస్టర్ యూజర్స్ గా ఉన్నారు. తెలుగు, ఉర్దు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత. సర్వీస్ చార్జీలు లేకపోవడంతో T-వ్యాలెట్ తెలంగాణలో పల్లె పల్లెకు చేరుకుంది. T-వ్యాలెట్ ద్వారా పల్లెలకు బ్యాకింగ్‌ సేవలు మరింత దగ్గరయ్యాయి.

First Published:  1 Jun 2023 7:03 PM IST
Next Story