Telugu Global
Telangana

ఖమ్మం అభ్యర్థిపై వీడని సస్పెన్స్‌.. తెరపైకి మరో పేరు

రాయల నాగేశ్వర రావు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2 రోజులుగా ఖమ్మం అభ్యర్థిపై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

ఖమ్మం అభ్యర్థిపై వీడని సస్పెన్స్‌.. తెరపైకి మరో పేరు
X

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌ వీడడం లేదు. ఈనెల 25తో నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, రామసహాయం రఘురామిరెడ్డితో పాటు మండవ వెంకటేశ్వర రావుల పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. జిల్లాకు చెందిన కొందరు నేతలు రాయల నాగేశ్వర రావు పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

రాయల నాగేశ్వర రావును ఇటీవల గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొందరు నాగేశ్వర రావు పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం.

రాయల నాగేశ్వర రావు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2 రోజులుగా ఖమ్మం అభ్యర్థిపై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మంత్రులు భట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను బెంగళూరుకు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే పిలిచినట్లు సమాచారం. ఇవాళ, లేదా రేపు అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.

First Published:  22 April 2024 9:24 AM IST
Next Story